పోస్ట్‌లు

జులై, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

వైసివి రెడ్డి - దొంగబర్రెగొడ్లు

“మతం గొప్పదే..కానీ దాని కన్నా మనిషి గొప్పవాడు… కళ గొప్పదే.. కానీ దానికన్నా జీవితం గొప్పది…” ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే రాయలసీమ గర్వించదగ్గ రచయిత వైసివి రెడ్డి కథా సంపుటి “గట్టి గింజలు’కు ముందుమాట రాస్తూ దాశరథి రంగాచార్య ఇలా అన్నారు. “రెడ్డిగారి కథలు అన్నీ మంచివనీ చెప్పలేం. అయితే అన్నిటిలోనూ సామాన్యుని జీవితాన్ని చిత్రించడానికి ప్రయత్నించారు. కళావాదులకు ఇందులో “కళ’ లోపించిందనే భావం వస్తే రావొచ్చు. ‘కొయ్యబొమ్మలె మెచ్చుకళ్లకు కోమలుల సౌరెక్కునా?’ అన్నారు గురజాడ. జనజీవితాన్ని చిత్రించిన కథలు రాసినందుకు వైసివిరెడ్డి గారిని అభినందిస్తూ ఇలాంటి రచనలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను” ఫిబ్రవరి 10, 1982లో ఆయన ఈ మాట రాశారు. అంటే ఏది కళ, ఏది కాదు అనే గొడవ అంతకుముందు నుంచే ఉంది. అయితే జీవితం అన్ని కళల కన్నా గొప్పదనే వాదన కూడా అప్పటి నుంచే ఉంది. నాకు దృష్టిలోపమని ఎవరైనా అనుకుంటే అనుకున్నారు కానీ నాకు మటుకు సంభాషణలు తక్కువగా ఉన్న కథలు మంచి కథలుగా అనిపిస్తాయి. ఒకవేళ సంభాషణలు ఎక్కువగా ఉన్నా అవి అనివార్యమైతేనే నాకు అంగీకారం అవుతాయి. అలా సంభాషణలు తక్కువగా ఉండి.. గాఢమైన భావసాంధ్రతను అతి...

అజయ్ ప్రసాద్ తో వేంపల్లె షరీఫ్ ఇంటర్వ్యూ...

crafting లో art ఉండదు... without art ఏదీ నిలవదు - బి. అజయ్ ప్రసాద్     గుంటూరు జిల్లా నకిరేకల్ లో పుట్టారు బి. అజయ ప్రసాద్. 2005లో "మరుభూమి' అనే కథతో కథాసాహిత్యంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంతవరకు పాతిక కథలు రాశారు. వాటిల్లో కొన్ని ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. మరికొన్ని ప్రముఖ సంకలనాల్లో వచ్చాయి. అయినా ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తనకేమీ తెలియదంటూనే "లోయ, బానిసల స్వర్గం,ఖేయాస్, జాగరణ' వంటి మంచికథలు రాశారు. ఆయనతో కథ గ్రూప్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ............... 1 : మీ దృష్టిలో కథంటే ఏంటి? జ : ఏదైనా కావొచ్చు. కల, అనుభవం, జ్ఞాపకం, అనేక కోణాలున్న సంఘటన. 2: మీకు కథలు ఎక్కడ పుడతాయి? జ : ఫలాన చోటంటూ ఏమీ లేదు. నిద్రలో, మెలకువలో, ప్రయాణంలో, నడకలో...లోపల ఎక్కడ్నుంచైనా కథ నడిచి రావొచ్చు. 3 : మీరు కథలు ఎందుకు రాస్తారు? జ : నా సతోషం కోసం రాస్తాను. అది కళాత్మకంగా ఉంటే ఆనందం. అదొక ఉద్వేగం. సాహసం. 4 : కథకు ఆలోచన పుట్టగానే మొదట మీరేం చేస్తారు? జ : ఆలోచనో, కథో పుడుతుంది తలలో. తలలోనే ఒక్కోసారి పూర్తవుతుంది. ఇంకొన్నిసార్లు కొన్ని రోజులు ఆగి మళ్లీ తనంత...

జుమ్మా – రాయలసీమ, పేదల, ముస్లిం జీవితాల కథలు - జంపాల చౌదరి

చిత్రం
  రెండు దశాబ్దాల క్రితం వరకూ తెలుగులో ముస్లిములైన రచయితలు ఉండేవారుకానీ, ముస్లిం కథ అంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత సాహిత్యం ఉన్నట్లు గుర్తు లేదు. గత రెండు దశాబ్దాలలో ముస్లిం సాంస్కృతిక, సామాజిక నేపధ్యంలో చాలా కథలు వచ్చాయి. ఖదీర్‌బాబు, రహమతుల్లా వంటి కథకులు ముస్లిం జీవన విధానాలని, కుటుంబ బాంధవ్యాలని, సామాజిక సంబంధాలని ముస్లిమేతర పాఠకులకు పరిచయం చేయటంలో కృతకృత్యులయ్యారు. యువ రచయిత శ్రీ వేంపల్లె షరీఫ్ కూడా ఆ బాటనే పయనిస్తున్న కథకుడు అనవచ్చు కానీ, అది షరీఫ్ రాసిన కథల్ని మరీ ఇరుకుగా వర్గీకరించడమౌతుంది. శ్రీ షరీఫ్ ఈ మధ్యే ప్రచురించిన కథాసంకలనం జుమ్మా లో 12 కథలు ఉన్నాయి. రెండు కథల్లో అసలు ముస్లిం పాత్రలే లేవు. మిగతా పది కథలకు ముస్లిం కుటుంబాలే నేపధ్యం ఐనా, వాటిలో కొన్నిటికి ఆ కథలో వ్యక్తులు ఏ మతానికి చెందినవారన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. ముస్లిం జీవనం ముఖ్యపాత్ర వహించేది నాలుగు కథల్లో మాత్రమే (పర్దా, జుమ్మా, ఆకుపచ్చ ముగ్గు, తెలుగోళ్ళ దేవుడు). మిగతా కథలు చాలావరకూ రాయలసీమలో పేద కుటుంబాల కథలు. ఆ కథలను పెద్ద మార్పులు లేకుండా హిందూ, క్రిస్టియన్ పాత్రలను పెట్టి రాసినా...